Home  »  TV News  »  స్వప్నకి డైమండ్ రింగ్ ఇచ్చి ఇంప్రెస్ చేసిన రాహుల్!

Updated : Feb 13, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి'   సీరియల్.. రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతూ వస్తోంది. ఈ సీరియల్ శనివారం నాడు ఎపిసోడ్-17 లోకి అడుగుపెట్టింది. రాజ్ కార్ లో‌ స్వప్నని కలవడానికి వెళ్దామని చూస్తే కార్ స్టాట్ అవ్వదు. దాంతో అక్కడే ఆగిపోతాడు రాజ్. అయితే రాజ్ కార్ ని కావాలనే స్టాట్ అవ్వకుండా ప్లాన్ చేస్తాడు రాహుల్. అక్కడ రాహుల్ డబ్బులిచ్చి పెట్టిన మనిషి రాహుల్ కి కాల్ చేసి..రాజ్ ఇక్కడే ఆగిపోయాడని కాల్ చేసి చెప్తాడు.‌ ఆ తర్వాత రాజ్ కోసమని స్వప్న రెడీ అయ్యి బేకరికి వెళ్తుండగా.. రాహుల్ డబ్బులిచ్చి తీసుకొచ్చిన కిరాయి రౌడీలు స్వప్నని చుట్టుముట్టి గలాటా చేస్తుంటారు. మధ్యలో‌ స్వప్న చెల్లి 'అప్పు' వచ్చి రౌడీలను చితక్కొడుతుంది. అయితే ఒక రౌడీకి కాల్ చేసి తనని డైవర్ట్ చేయమని చెప్పడంతో.. అతను అలాగే చేస్తాడు. ఆ తర్వాత రాహుల్ ఎంట్రీ ఇచ్చి రౌడీలను కొట్టినట్లుగా, స్వప్నని సేవ్ చేస్తున్నట్టిగా యాక్ట్ చేస్తాడు. ఫైట్ ముగిసాక స్వప్నకి రాహుల్ సారి చెప్తాడు.


ఆ తర్వాత స్వప్న, రాహుల్ ఇద్దరు కలిసి బేకరీ లోపలికి వెళ్తారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆ బేకరి మొత్తం లవ్ షేప్ గల బెలూన్స్ తో బాగా డెకరేట్ చేసి ఉంటుంది. ఇక స్వప్నతో, రాహుల్ తన ఫ్లర్టింగ్ స్టాట్ చేసి.. స్వప్నకి డైమండ్‌ రింగ్‌ గిఫ్ట్ గా ఇస్తాడు. కాసేపు స్వప్నని ఇంప్రెస్ చేస్తూ మాట్లాడుతుంటాడు. డైమండ్ రింగ్ చూసి, అతని మాటలు చూసి స్వప్న ఇంప్రెస్ అవుతుంది. అయితే రాజ్ వస్తే చెప్పమని రాహుల్ బేకరి బయట ఒక మనిషిని ఏర్పాటు చేస్తాడు.. అతను రాజ్ రాగానే కాల్ చేసి చెప్పడంతో.. రాహుల్ స్వప్న నుండి దూరంగా వచ్చేస్తాడు. స్వప్న కూర్చున్న టేబుల్ దగ్గరకి రాజ్ వెళ్ళి పలకరిస్తాడు. రాజ్ తన మనసులో ఉన్న మాటలన్నీ స్వప్నతో చెప్తుంటాడు. కానీ అవన్నీ స్వప్నకి సోదిలా అనిపిస్తాయి. రాజ్ గిఫ్ట్ అని చెప్పి ఒక చాక్లెట్ ప్యాక్, మరొక రాధాకృష్ణుల బొమ్మని తీసుకొస్తాడు. అది చూసి స్వప్న‌‌.. "అయ్యో .. నీకన్నా రాహులే నయం కదా రాజ్, డైమండ్ రింగ్ ఇచ్చాడు.. నువ్వేమో ఈ పనికిరాని చాక్కెట్ ప్యాక్, అవసరంలేని మట్టి బొమ్మ తెచ్చావ్" అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత.. "నీ గోల్ ఏంటి? ఎలా ఉండాలనుకుంటున్నావ్? ఏం అవుదామనుకుంటున్నావ్" అని రాజ్ అడుగగా.. "ఇది డేటింగా లేక నా పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాసా అని స్వప్న మనసులో అనుకుంటుంది. రాజ్ ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు. 

మరోవైపు స్వప్న చెల్లి అప్పు గాయాలతో ఇంటికి వెళ్తుంది. అక్కడ కావ్య అప్పుని చూసి ఏంటి ఈ గాయాలని అడిగేసరికి జరిగిందంతా చెప్తుంది.  ఆ రాజ్ ఏదో చేసినట్టు ఉన్నాడని కావ్య భావిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.